CS somesh kumar: చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమం ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’
జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అన్నారు
- By Balu J Published Date - 05:00 PM, Thu - 22 December 22

జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అన్నారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని సంజీవయ్య పార్కులో ఆయన మొక్కను నాటారు. అనంతరం సోమేశ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి పట్ల అవగాహనతో జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతమైన కార్యక్రమం అన్నారు.
భారత దేశ చరిత్రలో ఇంత భారీయెత్తున్న మొక్కలు నాటే కార్యక్రమం, సంస్థ ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు అని అన్నారు. ప్రకృతిపట్ల ఆరాధనతో చేస్తున్న జోగినిపల్లి సంతోష్ కుమార్ చేస్తున్న వనయజ్ఞంలో ప్రజలంతా స్వచ్ఛందంగా మొక్కల నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో … గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవేందర్ యాదవ్, హెచ్ ఎం డీ ఏ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: BRS MLA Jeevan Reddy: మాది ఫైటర్స్ ఫ్యామిలీ.. బీజేపీది ఛీటర్స్ ఫ్యామిలీ!

Related News

MLC Kavitha: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్-నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత!
భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత నియమితులయ్యారు.