IND vs AUS T20 : కిక్కిరిసిన జింఖానా గ్రౌండ్.. టికెట్ల కోసం క్యూలైన్లో..!
కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కు టికెట్స్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి...
- Author : Prasad
Date : 22-09-2022 - 10:22 IST
Published By : Hashtagu Telugu Desk
కాసేపట్లో ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ కు టికెట్స్ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులు టికెట్ల కోసం రాత్రి 10గంల నుంచే క్యూ లైన్లలో ఉన్నారు. ఉదయం 10గంల నుంచి సాయంత్రం 5గంల వరకు జింఖానా గ్రౌండ్ లో టికెట్ కౌంటర్ ఏర్పాటు చేశారు. గత కొన్ని రోజులుగా ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై గందరగోళం ఏర్పడింది. అయితే క్రికెట్ ఫ్యాన్స్ డిమాండ్‌తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దిగొచ్చింది. ఎట్టకేలకు నేడు టికెట్స్‌ని విక్రయించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈనెల 25న ఉప్పల్ లో ఇండియా, ఆసీస్ మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. టికెట్ విక్రయాల నేపథ్యంలో జింఖానా గ్రౌండ్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.