Corona Update: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..!
- Author : HashtagU Desk
Date : 23-03-2022 - 11:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఇండియాలో గడచిన 24 గంటల్లోకొత్తగా 1,778 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 62 మంది ప్రాణాలు కోల్పోయారని, అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 2,542 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది. దేశంలో ఇప్పటి వరకు 4,30,12,749 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,16,605 మంది కరోనా కారణంగా మరణించారు.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,24,73,057 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 23,087 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.40 శాతం ఉంది. కరోనా రికవరీ రేటు 98.74 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో 1,81,89,15,234 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.