Corona Virus: ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు..!
- By HashtagU Desk Published Date - 01:01 PM, Thu - 31 March 22
ఇండియాలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తుంది. ఈ క్రమంలో గత 24 గంటల్లోకొత్తగా 1,225 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు 28 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అలాగే దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా నుండి 1,594 మంది కోలుకున్నారని , కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా బులెటిన్‌ను విడుదల చేసింది.
ఇక దేశంలో ఇప్పటి వరకు 4,30,24,440 కోట్ల కరోనా కేసులు నమోదవగా.. 5,21,129 మంది కరోనా కారణంగా మరణించారు. అలాగే ఇండియాలో ఇప్పటి వరకు 4,24,89,004 కోట్ల మంది కరోనా నుంచి కోరుకున్నారని సమాచారం. ఇక మరోవైపు దేశంలో ప్రస్తుతం ఇండియలో 14,307 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇకపోతే దేశం కరోనా పాజిటివిటీ రేటు 0.20 శాతం ఉంది. కరోనా రికవరీ రేటు 98.76 శాతానికి పెరిగింది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఇండియాలో 1,84,06,55,005 కోట్లు కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
Tags
Related News
Congenital Squint : మెల్లకన్ను ఉంటే ఎలా ? ఏం చేయాలి ?
చాలామందికి మెల్లకన్ను ఉంటుంది. దీన్నే ఇంగ్లిష్‌లో ‘స్క్వింట్ ఐ’ అని పిలుస్తారు.