Corona Cases Update: ఇండియాలో కరోనా కేసులు.. లేటెస్ట్ అప్‌డేట్..!
- By HashtagU Desk Published Date - 12:00 PM, Tue - 22 February 22

ఇండియలో కరోనా భారీగా తగ్గుముఖం పట్టాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపిందది. ఈ క్రమంలో నిన్న ఒక్కరోజు దేశ వ్యాప్తంగా 13,405 కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశంలో 34,226 మంది కరోనా నుండి కోలుకోగా 235 మంది కరోనాతో మృతి చెందారు. దీంతో భారత్‌లో ప్రస్తుతం 1,81,075 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,21,58,510 మంది కరోనా నుండి కోలుకోగా, 5,12,344 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఇండియాలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 1.24 శాతంగా ఉంది. అలాగే ఇప్పటి వరకు దేశంలో 175,83,27,441 డోసుల వ్యాక్సిన్లు వినియోగించారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక తెలంగాణలో గత 4 గంటల్లో 385 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు 733 మంది కరోనా నుంచి కోలుకోగా, ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,87,063 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 7,78,167 మంది ఆరోగ్యవంతులయ్యారు. దీంతో తెలంగాణలో ప్రస్తుతం 4,787 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయని, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక నిన్న ఒక్కరోజున 950 మంది కరోనా నుండి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఒకరు కరోనా కారణంగా మరణించారు. దీంతో ప్రస్తుతం ఏపీ రాష్ట్రంలో ఇప్పటివరకు 23,16,467 పాజిటివ్ కేసులు నమోదవగా,14,714 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఏపీలో ఇప్పటి వరకు 22,95,768 మంది కరోనా నుండి కోలుకుని ఆరోగ్యవంతులయ్యారని, దీంతో ప్రస్తుతం 5,985 మంది కరోనా సోకిన రోగులు చికిత్స పొందుతున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.