Andhra Pradesh : ఏపీలో కానిస్టేబుల్ పరీక్ష ప్రారంభం… ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులకు నో ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పరీక్ష
- By Prasad Published Date - 12:08 PM, Sun - 22 January 23

ఆంధ్రప్రదేశ్‌లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రాథమిక పరీక్ష ఈ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 997 పరీక్షా కేంద్రాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. 6,100 పోస్టులకు 5.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కాగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, సీసీ కెమెరాలతో పరీక్షను పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. చివరి నిమిషంలో అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను అనుమతించిన అధికారులు 10.00 గంటల తర్వాత అభ్యర్థులను అనుమతించలేదు. చాలచోట్ల లేటుగా వచ్చిన అభ్యర్థులను వెనక్కి పంపించివేశారు.