Serilingampally: శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ గెలుపు ఖాయం: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
కార్పొరేటర్ గా తిరుగులేని ప్రజాదరణ సొంతం చేసుకున్న జగదీశ్వర్ గౌడ్ అసెంబ్లీ బరిలో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
- By Balu J Published Date - 03:14 PM, Wed - 22 November 23

Serilingampally: కార్పొరేటర్ గా తిరుగులేని ప్రజాదరణ సొంతం చేసుకున్న జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ బరిలో నిలుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుండటంతో జగదీశ్వర్ గౌడ్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శేరిలింగంపల్లిలోని అన్నీ ప్రధాన డివిజన్ల లో ఆయన వరుసగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎండను, చలిని లెక్కచేయకుండా ఉదయం నుంచి పగలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు, మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొని జగదీశ్వర్ గౌడ్ కు జై కొడుతున్నారు. బుధవారం నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటువేయాలని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందని, అందుకే ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేసేందుకు ఇష్టం చూపుతున్నారని ఆయన అన్నారు. 500 లకే సిలిండర్, మహిళలకు 2000 వేల పింఛన్, ఉచిత ప్రయాణం కాంగ్రెస్ పార్టీ కల్పిస్తుందని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గవర్నమెంట్ బడులను తీర్చిదిద్దుతామని, ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు కాంగ్రెస్ స్కాలర్ షిప్ అందిస్తందని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. శేరిలింగంపల్లిలో మార్పు రావడం ఖాయమని, కాంగ్రెస్ గెలుపు ఖాయమని జగదీశ్వర్ అన్నారు.