Hyderabad: మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై కాంగ్రెస్ నేత
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు సుదర్శన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత నార్సింగి పోలీసులను ఆశ్రయించింది.
- By Praveen Aluthuru Published Date - 03:56 PM, Sat - 24 February 24

Hyderabad: అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకుడు సుదర్శన్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ వివాహిత నార్సింగి పోలీసులను ఆశ్రయించింది. సుదర్శన్ తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్నాడని హైదర్‌షాకోట్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.
వాహేతర సంబంధంకు ఆమె నిరాకరించడంతో అతడు ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె నివాసం వైపు నిఘా కెమెరాలను అమర్చి ఆమె కదలికలను గమనిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.