Cafe Positive : ‘కేఫ్ పాజిటివ్’.. స్పెషాలిటీ తెలుసా ?
కోల్‌కతాలోని 64ఏ లేక్ వ్యూ రోడ్డు వద్ద గత మూడున్నర ఏళ్లుగా ‘కేఫ్ పాజిటివ్’ (Cafe Positive)ను నిర్వహిస్తున్నారు. ఈ కాఫీ షాపు ట్యాగ్‌లైన్.. ‘‘కాఫీ బిహైండ్ బౌండరీస్’’.
- By Pasha Published Date - 01:07 PM, Fri - 1 December 23

Cafe Positive : ఇవాళ ‘వరల్డ్ ఎయిడ్స్ డే’. ఈసందర్భంగా మనం ఒక అరుదైన కాఫీ షాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ‘కేఫ్ పాజిటివ్’ అనే కాఫీ షాపును 14 మంది యువకులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. అయితే వీరంతా హెచ్‌ఐవీ పాజిటివ్ వ్యక్తులే. సమాజంలో హెచ్ఐవీపై ఉన్న ప్రతికూల ఆలోచనలను తొలగించే లక్ష్యంతోనే ఈ కేఫ్‌ను సామాజిక కార్యకర్త డాక్టర్ కల్లోల్ ఘోష్ ప్రారంభించారు. హెచ్‌ఐవీ ఉన్న వ్యక్తులకు అవగాహన పెంపొందించడం, ఉపాధిని కల్పించటమే కేఫ్ పాజిటివ్ (Cafe Positive) ప్రధాన లక్ష్యం.
We’re now on WhatsApp. Click to Join.
కోల్‌కతాలోని 64ఏ లేక్ వ్యూ రోడ్డు వద్ద గత మూడున్నర ఏళ్లుగా ‘కేఫ్ పాజిటివ్’ (Cafe Positive)ను నిర్వహిస్తున్నారు. ఈ కాఫీ షాపు ట్యాగ్‌లైన్.. ‘‘కాఫీ బిహైండ్ బౌండరీస్’’. ఈ కేఫ్‌కు విద్యార్థులు, నగరానికి చెందిన ప్రముఖులు తరచుగా వస్తుంటారు. ప్రస్తుతం సమాజంలో హెచ్‌ఐవీ సోకిన వ్యక్తుల పట్ల ఉన్న ప్రతికూల ఆలోచనలను అధిగమించడానికి ఈ కేఫ్ సహాయపడుతోంది.
Also Read: Rs 2000 Note: రూ. 2000 నోట్ల చలామణిపై ఆర్బీఐ కీలక ప్రకటన..!
సామాజిక కార్యకర్త డాక్టర్ కల్లోల్ ఘోష్ దేశవ్యాప్తంగా ఇటువంటి 30కిపైగా టిఫిన్ సెంటర్స్‌ను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాటిలో జాబ్స్ ఇచ్చేందుకు ఎయిడ్స్ పాజిటివ్ నిర్ధారణ అయిన దాదాపు 800 మందిని ఇప్పటికే ఎంపిక చేశారు. కోల్‌కతాలోని కేఫ్‌ను నడుపుతున్న ఈ టీనేజర్లందరినీ హెచ్‌ఐవీ పాజిటివ్ కన్ఫార్మ్ అయిన తర్వాత వారి కుటుంబాలు వదిలేశాయి. అలాంటి వారిని డాక్టర్ కల్లోల్ ఘోష్ చేరదీసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుండటం(Cafe Positive) స్ఫూర్తిదాయకం.