world cup 2023: షమీ గ్రామంలో మినీ స్టేడియం
ప్రపంచకప్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గత సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు.
- By Praveen Aluthuru Published Date - 04:25 PM, Fri - 17 November 23
world cup 2023: ప్రపంచకప్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. గత సెమీఫైనల్ పోరులో న్యూజిలాండ్ పై 7 వికెట్లు పడగొట్టి టీమిండియాకు విజయాన్ని అందించాడు. అయితే అతని స్వంత గ్రామం సహస్‌పూర్ అలీనగర్ లో మినీ స్టేడియం నిర్మిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. షమీ కుటుంబం గ్రామంలోనే నివసిస్తోంది. షమీ కూడా అక్కడికి వెళ్తూనే ఉంటాడు. ప్రపంచకప్‌లో షమీ మెరుపులు మెరిపించడంతో గ్రామస్తుల్లోనే కాకుండా చుట్టుపక్కల ప్రజల్లో కూడా ఆనందం వెల్లివిరిసింది.
ఈ రోజు శుక్రవారం సీడీఓ అశ్వనీ కుమార్ మిశ్రా, ఇతర అధికారులు షమీ గ్రామాన్ని సందర్శించారు. స్టేడియం కోసం స్థలం కోసం కసరత్తు ప్రారంభించారు. యువజన సంక్షేమ శాఖ తరపున గ్రామంలో మినీ స్టేడియం నిర్మించాలని నిర్ణయించారు. ఇక్కడ గ్రామాధికారి నురే షాబా స్టేడియం నిర్మాణానికి భూమిని చూపించారు. ఈ మేరకు భూమి కొలత తదితర పనులు పూర్తి చేయాలని సీడీఓ అశ్వనీ కుమార్ మిశ్రా సంబంధిత అధికారుల్ని కోరారు.
Also Read: Rudraksha: రుద్రాక్ష ధరించడం వల్లే కలిగే ఉపయోగాలు ఇవే