Funniest Moments : మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కలుపుగోలు ముచ్చట్లు
Funniest Moments : తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలసి సరదాగా (Funniest Moments) మాట్లాడుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు
- Author : Sudheer
Date : 01-04-2025 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఎప్పుడూ ఎనర్జిటిక్ లీడర్‌గానే కాకుండా తన సహచరులతో సరదాగా ముచ్చట్లు పెట్టే మనస్తత్వం కలిగిన వ్యక్తిగా కూడా పేరు పొందారు. దీనికి ఉదాహరణే ఇది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలసి సరదాగా (Funniest Moments) మాట్లాడుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు. వారి మధ్య జరిగే ఈ హాస్యపూరిత సంభాషణను పక్కనున్న మంత్రులు, అధికారులు ఆస్వాదించారు. ఈ సరదా సందర్భాన్ని మంత్రి సీతక్క తన మొబైల్ ఫోన్‌లో వీడియోగా చిత్రీకరించడం గమనార్హం. మంత్రివర్గ సమావేశాల మధ్యలోనూ సీఎం రేవంత్, మంత్రులు తాము వ్యక్తిగతంగా ఎంత సన్నిహితంగా ఉంటారో ఈ దృశ్యం చాటిచెప్పింది. రాజకీయంగా ఎంత బిజీగా ఉన్నా, కొంత సమయాన్ని సరదాగా గడిపేందుకు సీఎం ఆసక్తి చూపడం అందర్నీ ఆకట్టుకుంది.
Tollywood : నా సినిమాలను బ్యాన్ చేయండి – నిర్మాత నాగవంశీ
సీతక్క (Minister Sithakka) షూట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా రాజకీయ నాయకులు అధికార భాధ్యతలతో తీరిక లేకుండా ఉంటారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలసి సరదాగా గడిపిన క్షణాలు అందరికీ కొత్త అనుభూతిని కలిగించాయి. రాజకీయంగా ఎంత బిజీ బాధ్యతలు ఉన్నా, సరదా పంచుకోవడం కూడా అవసరమేనని ఈ దృశ్యాలు నిరూపిస్తున్నాయి.
మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కలుపుగోలు ముచ్చట్లు
సరదా సన్నివేశం.. మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కలుపుగోలు ముచ్చట్లు
సీఎం, మంత్రులు సరదాగా మాట్లాడుకుంటుండగా.. ఆ దృశ్యాన్ని మొబైల్‌లో చిత్రీకరించిన మంత్రి సీతక్క #HCU #meeting #RevanthReddy #TelanganaCongress #HashtagU pic.twitter.com/c2D023RMmY
— Hashtag U (@HashtaguIn) April 1, 2025