HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Rekha Gupta Inaugurated A Wonderful Deepotsav At Delhis Kartavya Path

Deepotsav: ఢిల్లీ కర్తవ్య పథ్‌లో అద్భుత దీపోత్సవం.. ప్రారంభించిన సీఎం రేఖ గుప్తా!

దీంతో పాటు వేదికపై రామకథా ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు భారతీయ పురాణ చరిత్ర, కళా రూపాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి.

  • Author : Gopi Date : 18-10-2025 - 7:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deepotsav
Deepotsav

Deepotsav: దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక కర్తవ్య పథ్ (గతంలో రాజ్‌పథ్) ప్రాంతం మొట్టమొదటిసారిగా దీపావళి సందర్భంగా అద్భుతమైన దీపోత్సవ కాంతులతో (Deepotsav) వెలిగిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేఖ గుప్తా పాల్గొన్నారు. ఈ దీపోత్సవం ప్రత్యేకత ఏమిటంటే.. కర్తవ్య పథ్ పొడవునా రికార్డు స్థాయిలో 1.51 లక్షల దీపాలను వెలిగించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని ద్విగుణీకృతం చేసింది.

ముఖ్యమంత్రి రేఖ గుప్తా మంత్రులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి దీపాలు వెలిగించడం ద్వారా ఈ దీపోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా ఆకాశంలో అద్భుతమైన డ్రోన్ షోలు నిర్వహించారు. డ్రోన్‌లు ఆకాశంలో దీపాల కాంతులతో వివిధ ఆకృతులను, సందేశాలను ప్రదర్శించడం చూపరులను మంత్రముగ్ధులను చేసింది.

Also Read: Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

దీంతో పాటు వేదికపై రామకథా ప్రదర్శన, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు భారతీయ పురాణ చరిత్ర, కళా రూపాల గొప్పతనాన్ని చాటిచెప్పాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా మాట్లాడుతూ.. కర్తవ్య పథ్‌లో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ దీపోత్సవం ప్రజలకు ఆనందాన్ని, సాంస్కృతిక అనుభూతిని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సవాలను మరింత గొప్పగా జరపాలనే ప్రభుత్వ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఈ దీపోత్సవం ఢిల్లీ ప్రజలకు, పర్యాటకులకు చిరస్మరణీయమైన అనుభూతిని ఇచ్చింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Rekha Gupta
  • Deepotsav
  • delhi
  • delhi cm
  • Delhi Kartavya Path

Related News

Farmers' 'Maha Panchayat' in Delhi today; high tension at the Shambhu border (Haryana-Punjab).

Farmer Protest: ఢిల్లీలో నేడు రైతుల మహా పంచాయత్‌.. హర్యానా-పంజాబ్ సరిహద్దు శంభు బార్డర్ వద్ద హైటెన్షన్

ఇప్పటికే విభిన్న నిరసనలతో అట్టుడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీలో మరో భారీ ఆందోళనకు వేదిక సిద్ధమైంది. భారత్-అమెరికా (India-US) మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందాన్ని (Trade Deal) తీవ్రంగా వ్యతిరేకిస్తూ ‘దేశ్ బచావో మోర్చా’ ఆధ్వర్యంలో నేడు “మహాపంచాయత్” పిలుపునిచ్చారు. ఈ భారీ ధర్నాలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా సుమారు 550కి పైగా రైతు సంఘాలు, పలు సామాజిక సంస్థలు ఏకమయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత

  • ED raids across four states in terror funding and illegal infiltration case.

    ED Raids: ఉగ్రవాద నిధుల ఫండింగ్.. అక్రమ చొరబాటు కేసులో నాలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

Latest News

  • Nandamuri Balakrishna: NBK111 షూటింగ్‌లో.. హీరో నందమూరి బాలకృష్ణ కు గాయాలు

  • Ukraine: ఉక్రెయిన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడిలో నలుగురు భారతీయుల మృతి చెందడంతో రష్యాకు భారత్ సమన్లు

  • PM Modi: నీట్ పేప‌ర్ లీక్‌పై తొలిసారి మాట్లాడిన ప్రధాని మోదీ.. బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం

  • Tukaram Mundhe: తుకారం ముండే చేపట్టిన కఠిన చర్యలు ఫలిస్తున్నాయా? జలేబీ తన ప్రకాశవంతమైన ఆరెంజ్ కలర్ ను కోల్పోయిందంటూ వైరల్ పోస్ట్.

  • Donald Trump: కెనడియన్ వస్తువులపై 50% సుంకాలు విధించిన అమెరికా.. ఉత్తర అమెరికా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రం.

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd