CM KCR: సికింద్రాబాద్ మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా!
అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
- By Balu J Published Date - 12:31 PM, Fri - 17 March 23

సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదం పట్ల ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణనష్టం జరగటంతో పాటు, పలువురు గాయపడడం పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మరణించినవారికి ₹5 లక్షల ఎక్స్ గ్రేషియాను సీఎం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలతో పాటు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో వుండి పరిస్థితులను పరిశీలిస్తూ అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు సీఎం సూచించారు.

Related News

Vande Bharat Express: సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఏప్రిల్ 8న ప్రారంభం..?
మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) సికింద్రాబాద్-తిరుపతి మధ్య గుంటూరు మీదుగా ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఈ మార్గం అమల్లోకి వస్తే ఇది చాలా విజయవంతమైన లైన్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు.