Chandrababu : రిటైర్డ్ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్
రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు
- By Sudheer Published Date - 09:45 PM, Thu - 20 June 24

ఏపీలో అధికారం చేపట్టిన చంద్రబాబు..కీలక నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ చూపిస్తున్నారు. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వం లోపనిచేసిన పలువురు అధికారుల ఫై వేటు వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్ నీరభ్ కుమార్ అన్ని శాఖలను, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలను ఆదేశించారు. తొలగింపుల పై ఈ నెల 24వ తేదీ లోగా నివేదిక ఇవ్వాలని ఆయన తెలిపారు. ఎవరైనా రిటైర్డ్ ఉద్యోగుల సేవలు ఆ శాఖలో తప్పనిసరైతే నిబంధనలను అనుసరించి కొత్తగా ఉత్తర్వులు ఇవ్వాలని సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈరోజు రాజధాని అమరావతి లో సీఎం చంద్రబాబు పర్యటించారు. అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ‘వైసీపీ హయాంలో అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు. భవనాలు బూజు పట్టిపోయాయి. రైతుల్ని ఎంతో ఇబ్బంది పెట్టి దౌర్జన్యంగా వ్యవహరించారు. అన్ని ప్రాంతాల నుంచి పవిత్ర మట్టి, నీరు తెచ్చి అమరావతి శంకుస్థాపన చేశాం. ఈ స్థల మహత్యమే అమరావతిని కాపాడింది’ అని చెప్పుకొచ్చారు.
Read Also : Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు