Arvind Kejriwal : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు
రూ.లక్ష పూచీకత్తుతో రూస్ అవెన్యూ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది
- By Sudheer Published Date - 09:02 PM, Thu - 20 June 24

ఢిల్లీ హైకోర్టులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )కు ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తుతో రూస్ అవెన్యూ కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. దీంతో.. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) నేతలు , శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జ్ నియామ్ బిందు ఈ బెయిల్‌ని మంజూరు చేశారు. దీంతో ఆయన తీహార్ జైలు నుంచి రేపు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ కేసులో కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి బెయిల్ కోసం పలుసార్లు కోర్టుకెక్కారు కానీ.. ప్రతిసారి నిరాశే ఎదురైంది. మధ్యలో ఎన్నికల ప్రచారం కోసం కొన్ని రోజుల పాటు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనంతరం ఆరోగ్య సమస్యల దృష్ట్యా తన బెయిల్‌ని కొనసాగించాలని కోరారు కానీ.. అది కుదరలేదు. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత శుక్రవారం బెయిల్ దొరకడంతో.. ఆప్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also : TFC : ఏపీ సర్కార్ కు తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి లేఖ