Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం( Accident) జరిగింది. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై లారీ, వ్యాన్ ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించారు. చిన్నారి గాయపడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
- By Gopichand Published Date - 09:36 AM, Thu - 19 January 23

ముంబై-గోవా హైవేపై గురువారం ఉదయం వ్యాన్, లారీ ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. ఓ చిన్నారి తీవ్రంగా గాయపడిందని రాయ్‌గఢ్ పోలీసులు తెలిపారు. రాయ్‌గఢ్ జిల్లాలోని రెపోలి ప్రాంతంలో గోవా-ముంబై హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది. ఘోర ప్రమాదం తర్వాత కారు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది.
Also Read: Assembly Elections 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..!
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం( Accident) జరిగింది. రాయగడ జిల్లా రెపోలీ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై లారీ, వ్యాన్ ఢీకొన్న ఘటనలో 9 మంది మరణించారు. చిన్నారి గాయపడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడ్డ చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం పరీక్షల కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రమాదానికి కారణమేంటో తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. హైవేపై వాహనాలు తిరిగి ప్రారంభమయ్యాయని, ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.