22 Crores : ఈ విస్కీబాటిల్ 22 కోట్లు.. ఎందుకు ?
22 Crores : ఈ విస్కీ బాటిల్‌ను వేలం వేస్తే ఏకంగా రూ.22 కోట్లకు అమ్ముడుపోయింది.
- By Pasha Published Date - 07:32 AM, Mon - 20 November 23

22 Crores : ఈ విస్కీ బాటిల్‌ను వేలం వేస్తే ఏకంగా రూ.22 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది ఎప్పటిదో తెలుసా ? 97 ఏళ్ల కిందటిది !! 1926లో మెకలాన్ కంపెనీ ఈ సింగిల్ మాల్ట్ విస్కీని తయారు చేసింది. ఈ నెల 18న సోత్‌బీ లండన్‌లో నిర్వహించిన వేలంలో.. ఈ విస్కీ అనూహ్యంగా రూ. 22 కోట్లు పలికి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
We’re now on WhatsApp. Click to Join.
మెకలాన్ కంపెనీ 1926లో ఈ విస్కీని తయారు చేసి.. 60 ఏళ్ల పాటు నిల్వ చేసింది. చివరకు 1986లో దాన్ని 40 బాటిళ్లలో నింపింది. వాటిలో కొన్నింటిని మెకలాన్ కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. అలా బయటికి వచ్చిన అరుదైన మెకలాన్ విస్కీ బాటిల్‌ను.. ఇప్పుడు వేలం వేస్తే 22 కోట్ల రూపాయల రికార్డు ధర పలికింది. 2019లో మరో మెకలాన్ విస్కీ బాటిల్‌ను వేలం వేస్తే దానికి రూ. 15 కోట్ల ధర వచ్చింది.