Cheddi Gang : తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ హల్చల్
తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ ముఠా హల్చల్ చేస్తోంది. ప్రహరీ గోడ దూకి ఓ ఇంటిలోకి...
- Author : Prasad
Date : 07-09-2022 - 11:16 IST
Published By : Hashtagu Telugu Desk
తిరుచానూరులో చెడ్డి గ్యాంగ్ ముఠా హల్చల్ చేస్తోంది. ప్రహరీ గోడ దూకి ఓ ఇంటిలోకి ప్రవేశించి సీసీ కెమెరాలను చెడ్డీ గ్యాంగ్ ముఠా ధ్వంసం చేసింది. సీసీ కెమెరాలు ధ్వంసం చేసే దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ లోని ఒకడి చేతిలో ఇనుప రాడ్డు పట్టుకుని తచ్చాడు తున్నట్లు విడియోలో కనిపిస్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీ ముమ్మరం చేశారు. చెడ్డీ గ్యాంగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.