Gold Silver: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Silver) నేడు స్వల్పంగా పెరిగాయి.
- By Gopichand Published Date - 07:16 AM, Sat - 7 October 23
Gold Silver: కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Silver) నేడు స్వల్పంగా పెరిగాయి. శనివారం ఉదయం హైదరాబాద్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 57,230గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు అమలవుతున్నాయి. కాగా.. కిలో వెండి ధర రూ.73,000కు చేరుకుంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇవే ధరలు అమలులో ఉన్నాయి.
బంగారం, వెండి ధరలలో మార్పులు చోటు చేసుకునేందుకు అనేక కారణాలున్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి తదితర కారణాలు పసిడి రేట్లపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక శనివారం (అక్టోబర్ 07, 2023) దేశీయంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల వివరాలివే..!
Also Read: Malaika Arora: బాలీవుడ్ ఐటమ్ బాంబ్ మలైకా అరోరా ఆరోగ్య రహస్యం ఇదే
We’re now on WhatsApp. Click to Join.
బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,650 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.57,380గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.52,850 కాగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 57,650గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.57,230 వద్ద ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,230గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 70,600 ఉండగా, ముంబైలో రూ.70,600గా ఉంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, కోల్కతాలో రూ.70,600గా ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.68,800 ఉండగా, కేరళలో రూ.73,000గా ఉంది. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.73,000 ఉండగా, విజయవాడలో రూ.73,000 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నంలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
Related News
e-Shram Card: ఈ కార్డు ఉంటే బోలెడు ప్రయోజనాలు.. నెలకు రూ.3000 పెన్షన్ కూడా..!
ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వీటిలో ఒకటి ఈ-శ్రమ్ కార్డ్ స్కీమ్. ఈ పథకం కింద ఆర్థికంగా వెనుకబడిన కూలీలకు ప్రతినెలా రూ.1000 సాయం అందుతుంది.