HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrayaan 3 Grand Success

Chandrayaan-3 Grand Success : జయహో భారత్..సాహో ఇస్రో

జాబిల్లి పై చంద్రయాన్ 3 (Chandrayaan 3) ను దించింది. ఇండియా అంటే ఇదిరా.. అని కాలర్ ఎగరేసేలా ఇస్రో చేసింది.

  • Author : Sudheer Date : 23-08-2023 - 6:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
chandrayaan-3 Grand Success
Chandrayaan 3 Grand Success

Chandrayaan-3 Grand Success : అంత భావించినట్లే ఇస్రో (ISRO) సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి పై చంద్రయాన్ 3 (Chandrayaan 3) ను దించింది. ఇండియా (India) అంటే ఇదిరా.. అని కాలర్ ఎగరేసేలా ఇస్రో చేసింది. ఉదయం నుండి ప్రపంచం మొత్తం ఎంతో ఉత్కంఠ గా ఎదురుచూసిన అపూర్వ ఘట్టానికి తెరపడింది. చంద్రుడి (Moon) పైన సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతం (Chandrayaan-3 Landing Success) అయింది. 40 రోజులుగా ఎదురు చూస్తున్న కోట్లాది కళ్లు ఆ ఘట్టాన్ని చూసి ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు.

సాఫ్ట్ ల్యాండింగ్ అయిన క్షణంలో ఒక్కసారిగా శాస్త్రవేత్తల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. అంతకుముందు అరగంట పాటు దేశమంతా అందరూ టీవీలు, ఫోన్ల తెరలకు అతుక్కుపోయి ఉత్కంఠగా సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను తిలకించారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో దేశం మొత్తం సంబరాల్లో మునిగింది. చంద్రుడిపైకి చేరిన నాలుగో దేశంగా ఇండియా నిలిచింది. ఈ విజయం తో దేశ ప్రజలంతా జయహో భారత్..సాహో ఇస్రో అంటున్నారు.

చంద్రయాన్ 3 సక్సెస్ కావడం పట్ల ప్రధాని మోడీ (PM Modi) ఇస్రో కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టమని , అమృత కాలంలో తొలి విజయం ఇదన్నారు. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసానని , ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారన్నారు.

అంతరిక్ష చరిత్రలో సరికొత్త రికార్డు భారత్ సృష్టించిందని, చంద్రయాన్ విజయం నవభారత్ జయధ్వానం అని మోడీ అన్నారు. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలని కొనియాడారు. చంద్రయాన్ 3 ఘన విజయంతో నా జీవితం ధన్యమైందన్నారు. మనం ఒక అద్భుతం చూశామన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chandrayaan
  • Chandrayaan 3
  • chandrayaan-3 Success
  • india
  • isro
  • modi
  • moon
  • Vikranth Lander

Related News

Cng Gas

CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్‌జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్

దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్‌జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్ర

    Latest News

    • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

    • Land Scam : హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి కబ్జా యత్నం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు

    • AP : కుప్పంలో పీఎం మిత్రా పార్క్, అమరావతిలో నిఫ్ట్.. కేంద్రానికి ఏపీ ప్రతిపాదనలు

    • Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిభ‌క్తులు.. వేసవి దృష్ట్యా ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు

    • Nellore : వేదాంత మీనాక్షి ఎనర్జీ 1000 మందికి స్వచ్ఛమైన తాగునీటి సదుపాయం!

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

      • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

      • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd