Chandrababu: పల్నాడులో చంద్రబాబు పర్యటన
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు
- By Praveen Aluthuru Published Date - 12:58 PM, Sun - 3 March 24

Chandrababu: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా టీడీపీ-జనసేన కూటమి వ్యూహాలు రచిస్తుంది. స్థానిక నేతలతో భేటీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం దిశగా అడుగులు వేస్తున్నారు. వెయ్యికి వెయ్యి శాతం టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని భావిస్తున్నారు.
చంద్రబాబు పల్నాడులోని దాగేపల్లిలో పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో పల్నాడు జిల్లాలోని మూడు నియోజకవర్గాల అభ్యర్థులు శిక్షణ పొందనున్నారు. పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజలకు సమర్ధవంతంగా తెలియజేయడం వంటి పలు అంశాలపై చంద్రబాబు పార్టీ నేతలతో చర్చించనున్నారు. రాజకీయ రంగంలో రాబోయే సవాళ్లు మరియు అవకాశాల కోసం పార్టీ సభ్యులను సిద్ధం చేయనున్నారు.
Also Read: HYD : ఫ్రీ కరెంట్ ‘0’ ఎక్కడ అంటూ గగ్గోలు పెడుతున్న నగరవాసులు