HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu Skill Development Case Supreme Court Postpones Hearing On Bail Revocation

Chandrababu Skill Development Case: చంద్రబాబు బెయిల్ రద్దుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా…

చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ రద్దుపై శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అనంతరం విచారణ జనవరి నెలకు వాయిదా పడింది. ఈ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

  • By Kode Mohan Sai Published Date - 02:38 PM, Fri - 29 November 24
  • daily-hunt
Cbn Skill Development Case
Cbn Skill Development Case

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్‌ గా వాదనలు వినిపించారు. బెయిల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. తాను ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు కావాలనుకుంటున్నందువల్ల జనవరి వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై, జస్టిస్ బేలా ఎం. త్రివేదీ ధర్మాసనం జనవరి రెండో వారానికి ఈ కేసు విచారణ వాయిదా వేసినట్లు ప్రకటించింది.

స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్:

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) క్లీన్ చిట్ ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో, ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ విచారణను చేపట్టింది. అయితే, ఈడీ తాజా ప్రకటన ఇప్పుడు చాలా కీలకంగా మారింది.

ఈడీ విచారణలో, నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని రుజువైంది. దీనితో, వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారంపై ఈడీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది.

గత సంవత్సరం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2014-2019 కాలంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో జరిగిన స్కామ్ ఆధారంగా, సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, హైకోర్టు నుండి బెయిల్ పొందిన తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ తాజా విచారణతో, చంద్రబాబు పై పెరిగిన అనుమానాలు తొలగిపోయి, ఆయనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిసింది.

పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర

స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో సంచలనమైన విషయాలు బయటపెట్టారు. ఆయన వివరించిన ప్రకారం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక ఒక పెద్ద కుట్ర జరిగింది. ఈ కుట్రలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని పలువురు ఉన్నారని, పోలీసులు కూడా ఈ కుట్రలో భాగమై వ్యవహరించినట్లు తెలిపారు.

పీవీ రమేశ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో కూడా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని, వారు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు. ఆయన ఈ సందర్భంగా, తాను అప్పట్లో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించి వాడారని, ఈ కారణంగా తాము న్యాయ పోరాటం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాక, ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాశానని ఆయన తెలిపారు.

పీవీ రమేశ్, అప్పటి సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఫైళ్లను మాయమయ్యాయని చెప్పిన విషయం గురించి మాట్లాడుతూ, అది “అత్యంత హాస్యాస్పదం” అని అభిప్రాయపడినారు. “ఫైళ్లు మాయమయ్యాయని చెప్పడంలోనూ పెద్ద కుట్ర దాగి ఉందని” ఆయన చెప్పారు. ఈ కేసును వీలైనంత త్వరగా నిగ్గు తేల్చడం, కూటమి ప్రభుత్వానికి మంచిదని పీవీ రమేశ్ వ్యాఖ్యానించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP CID
  • ap skill development case
  • Chandrababu Bail Cancel Petition
  • CM Chandrababu
  • Enforcement Directorate (ED)
  • Supreme Court
  • ys jagan

Related News

AP tops in exports of pharma and aqua products: CM Chandrababu

CM Chandrababu London : నవంబర్లో లండన్ పర్యటనకు సీఎం చంద్రబాబు

CM Chandrababu Londan : ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నవంబర్ 2 నుంచి 5 వరకు లండన్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ పర్యటన పూర్తిగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి

  • Supreme Court expresses deep anger over dog attacks on Delhi streets

    42% Backward Class Quota : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ కు భారీ దెబ్బ

  • Supreme Court Bc Reservatio

    BC Reservation : తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీం కోర్ట్

  • Bihar Jdu

    Bihar : బిహార్ లో 57 మందితో JDU తొలిజాబితా

  • Lokesh Google

    Google : రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు – మంత్రి లోకేశ్

Latest News

  • ‎Amla: ఉసిరికాయ మంచిదే కానీ వీరికి మాత్రం చాలా డేంజర్.. తిన్నారో ఇంక అంతే సంగతులు!

  • Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు

  • ‎Dhanteras 2025: ధన త్రయోదశి రోజు పొరపాటున కూడా ఈ వస్తువుల అస్సలు కొనకండి.. కొన్నారో అంతే సంగతులు!

  • ‎Spiritual: ఐశ్వర్యాన్ని ప్రసాదించే గోధుమల దీపం.. దీపావళి రోజు ఎలా వెలిగించాలో తెలుసా?

  • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

Trending News

    • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

    • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

    • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

    • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

    • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd