CBN Lawyer Comments : బెంగాల్ మంత్రులకు హౌస్ రిమాండ్ ఇచ్చారు.. చంద్రబాబుకూ ఇవ్వాలి : లూథ్రా
CBN Lawyer Comments : టీడీపీ చీఫ్ చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
- By Pasha Published Date - 12:20 PM, Mon - 11 September 23

CBN Lawyer Comments : టీడీపీ చీఫ్ చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించేందుకు కోర్టులోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జైలులో చంద్రబాబుకు ప్రాణహాని ముప్పు ఉందన్నారు. ఇదే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రాణహాని ముప్పు ఉన్నందున చంద్రబాబును జైలులో ఉంచడం సరికాదని, హౌస్ రిమాండ్ కు అవకాశం కల్పించాలన్నారు. దీనిపై కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. హౌస్ రిమాండ్ పిటిషన్ తో పాటు బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపిస్తామని లూథ్రా వెల్లడించారు.
Also read : Rajahmundry Central Jail : చంద్రబాబు ఫస్ట్ డే జైలు జీవితం ఎలా గడుస్తుందంటే..
2021లో పశ్చిమబెంగాల్‌లో ఐదుగురు మంత్రులకు ఒక కేసులో రిమాండ్ విధించారని.. అయితే అప్పట్లో ఆ మంత్రులు కోర్టును ఆశ్రయించగా హౌస్ రిమాండ్ ను విధించారని (CBN Lawyer Comments) గుర్తు చేశారు. ఈ ఉదాహరణను హౌస్ రిమాండ్ పిటిషన్ లో కోర్టు ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు విషయంలోనూ అదే తరహా హౌస్ రిమాండ్ కు అనుమతించాలని కోర్టును కోరుతామని వెల్లడించారు. హౌస్ రిమాండ్ పిటిషన్ అనంతరం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేస్తామని సిద్ధార్థ లూథ్రా వివరించారు.