Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
- By Balu J Published Date - 04:17 PM, Thu - 28 December 23

Chandrababu: కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. తనను అరెస్టు చేసిన సమయంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి కుప్పానికి వస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ, టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం, శాంతిపురంలోని ఎన్టీఆర్ సర్కిల్, రామకుప్పం లో బహిరంగసభలతో బాబు బిజీగా ఉండనున్నారు.
Also Read: Prabhas Salaar: బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సలార్, 500 కోట్లతో భారీ వసూళ్లు