HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Centre Procures 3 Lakh Tonnes Of Onions For Buffer Stock

Onions: టమాటా తర్వాత ఉల్లి.. ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు..!

టమాటా ధరల మంటల నుంచి గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఉల్లిగడ్డల (Onions) స్టాక్ ని ప్రారంభించింది.

  • Author : Gopichand Date : 18-07-2023 - 10:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onion Prices
Onion

Onions: గత కొన్ని వారాలుగా సామాన్యుల ప్లేట్‌లో టమోటాలు లేకుండా పోతున్నాయి. దేశవ్యాప్తంగా దీని ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో టమాటా కిలో రూ.250 స్థాయికి చేరుకుంది. అయితే, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఇప్పుడు టమాటా ధరలు తగ్గడం ప్రారంభించాయి. టమాటా ధరల మంటల నుంచి గుణపాఠం నేర్చుకున్న ప్రభుత్వం ఇప్పటికే ఉల్లిగడ్డల (Onions) స్టాక్ ని ప్రారంభించింది.

వార్తా సంస్థ PTI నుండి వచ్చిన వార్తల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఉల్లిపాయల బఫర్ స్టాక్‌ను సిద్ధం చేయడం ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉల్లిని సేకరిస్తున్నందున సీజన్‌ ముగిసినా ఉల్లికి కొరత ఉండదని పేర్కొంది.

టమాటా ధరలు తగ్గుముఖం పట్టాయి

టమోటా పరిస్థితి చూస్తే.. గతంలో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కిలో రూ.100 దాటింది. ప్రస్తుతం చాలాచోట్ల కిలో రూ.250 వరకు చేరింది. ప్రజలకు ఉపశమనం కలిగించడానికి మరియు టమోటా రిటైల్ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం రాయితీ ధరకు విక్రయించడం ప్రారంభించింది. ఇది ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో తగ్గింపు ధరతో అందుబాటులోకి వచ్చింది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం టమాటా హోల్‌సేల్‌లో కిలో రూ.80కి తగ్గినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read: Rs 10000 Crore Drones : 10వేల కోట్లతో 97 మేక్ ఇన్ ఇండియా డ్రోన్లు.. ఎందుకంటే ?

20 శాతం ఎక్కువ

PTI వార్తల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బఫర్ స్టాక్ కోసం ప్రభుత్వం 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను సేకరించింది. ఇది గత సంవత్సరం కంటే 20 శాతం ఎక్కువ. ఉల్లిని ఎక్కువ కాలం సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి పనిచేస్తోందని వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ సింగ్ తెలిపారు.

2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 2.51 లక్షల టన్నుల ఉల్లిపాయలను బఫర్ స్టాక్ కోసం ఉంచింది. సీజన్ ముగిసిన తర్వాత మార్కెట్‌లో సరఫరా తగ్గడం, ధరలు పెరగడం ప్రారంభించినప్పుడు ప్రభుత్వం బఫర్ స్టాక్ నుండి ఉల్లిపాయలను సరఫరా చేయడం ప్రారంభిస్తుంది. పండుగల సందర్భంగా ఉల్లి ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది.

ఉల్లి ధర పరిస్థితి ఇదీ

ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. జూలై 15న అఖిల భారత స్థాయిలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు రూ.26.79. దీని గరిష్ట ధర రూ.65 కాగా, కనిష్ట ధర కిలో రూ.10గా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buffer Stock
  • business
  • onion
  • Onion Buffer Stock
  • Onion Prices
  • tomato
  • Tomato Prices

Related News

Gold- Silver Rate Today

Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

చైనీస్ కొత్త సంవత్సరం సెలవుల కారణంగా మార్కెట్‌లో లిక్విడిటీ తక్కువగా ఉంది. దీనివల్ల చిన్న మార్పులు కూడా ధరల్లో పెద్ద హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయి.

  • Gold Rate

    బంగారం ధరలు ఇంతలా తగ్గడానికి కారణం ఏమిటి?

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Lakhpati Bitiya Yojana

    లఖ్‌పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!

  • UPI One World

    విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!

Latest News

  • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

  • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

  • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

  • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

Trending News

    • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

    • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

    • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd