Raja Singh: రాజాసింగ్ నోటి దూల.. నోటీసులు జారీ చేసిన ఈసీ
- Author : HashtagU Desk
Date : 17-02-2022 - 10:21 IST
Published By : Hashtagu Telugu Desk
యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు, ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమీషన్ కోరింది. యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయని వారిని గుర్తిస్తామని, జేసీపీ, బుల్‌డోజర్లతో వాళ్ళ ఇళ్ళను కూల్చేస్తామని, యూపీలో ఉండాలంటే యోగి ఆదిత్యనాధ్‌కు ఓటు వేయాలని, లేకుంటే యూపీ నుంచి వెళ్ళిపోవాలని, యూపీ ఓటర్లకు రాజసింగ్ వార్నింగ్ ఇస్తూ విడుదల చేసిన వీడియో వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాజాసింగ్‌కు ఈసీ నోటీసులు జారీ చేసింది. ఓటర్లను బెదిరించేలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఉన్నాయన్న ఈసీ, వివరణ ఇవ్వాలని ఆదేశించింది.