Car Accident : వైసీపీ ఎమ్మెల్సీ రహుల్లా కారు బీభత్సం.. బీఆర్టీఎస్ రోడ్డులో బైక్‌ని ఢీకొట్టిన కారు
విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఎమ్మెల్సీ రహుల్లా కారు బీభత్సం సృష్టించింది. బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా,
- By Prasad Published Date - 01:20 PM, Sun - 11 June 23

విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఎమ్మెల్సీ రహుల్లా కారు బీభత్సం సృష్టించింది. బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన తర్వాత కారు డ్రైవర్ కారుని వదిలి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారును గుణదల పోలిస్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన తరువాత కారు అద్దంపై ఉన్న ఎమ్మెల్సీ స్టిక్కర్‌ను తొలిగించినట్లు స్థానికులు అంటున్నారు. ఎమ్మెల్సీ బామ్మర్థి కారుని నడుపుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇటు ఎమ్మెల్సీ మాత్రం ఆ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నారు. గుణదల పోలీస్ స్టేషన్ ముందు మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలి డిమాండ్ చేస్తున్నారు.