HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Can Kkr Be Able To Stop Gujarat Titans Winning Spree

KKR vs GT: గుజరాత్ జోరుకు కోల్ కత్తా బ్రేక్ వేస్తుందా ?

ఐపీఎల్ 15వ సీజన్ లో ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది.

  • Author : Naresh Kumar Date : 23-04-2022 - 3:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gujarat Titans
Gujarat Titans

ఐపీఎల్ 15వ సీజన్ లో ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగనుంది. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మూడింటిలో గెలుపొంది, 4 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుండగా, గుజరాత్ టైటాన్స్ జట్టు 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు ఒక ఓటమితో అగ్రస్థానంలో నిలిచింది. గత మ్యాచ్‌లో కేకేఆర్.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 7 పరుగుల తేడాతో ఓడగా, గుజరాత్ టైటాన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ పై 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. బలాబలాల పరంగా గుజరాత్ టైటాన్స్ తో పోలిస్తే కేకేఆర్ కాస్త బలంగానే కనిపిస్తున్నప్పటికీ, ఆ జట్టులోని ఆటగాళ్లు ఆశించిన మేర రాణించలేకపోతున్నారు.

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ మంచి జోరుమీదుండగా ఆ జట్టులో హార్దిక్ పాండ్య , డేవిడ్ మిల్లర్, శుబ్ మాన్ గిల్, రాహుల్ తేవాటియా , రషీద్ ఖాన్ ఫామ్‌లో ఉండటాన్ని బట్టి చూస్తే, ఆ జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఎవ్వరూ నిలకడగా రాణించలేకపోతున్నారు. శ్రేషాయ్ అయ్యర్ , వెంకటేష్ అయ్యర్, రస్సెల్ తమ స్థాయికి తగ్గ ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. అలాగే బౌలింగ్ లో సునీల్ నరైన్, పాట్ కమిన్స్, శివమ్ మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి చెలరేగాల్సిన అవసరముంది. ఇక ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను ఢీకొట్టే గుజరాత్ టైటాన్స్ తుదిజట్టును పరిశీలిస్తే..ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా , శుభమాన్ గిల్ ఆరంబించనుండగా, టాపార్డర్ లో విజయ్ శంకర్, మిడిలార్డర్ లో హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, లోయరార్డర్ లో అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, బ్యాటింగ్ కు రానున్నారు. అలాగే ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లో రషీద్ ఖాన్ , అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ షమీ కీలకం కానున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gujarat Titans
  • IPL 2022
  • kolkata knight riders

Related News

    Latest News

    • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

    • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

    • స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?

    • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

    • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

    Trending News

      • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

      • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

      • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

      • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

      • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd