Cabinet Secretary: మోడీ కేబినెట్ సెక్రటరీ పదవి కాలం పొడిగింపు
మోడీ ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పదవి కాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
- By Praveen Aluthuru Published Date - 05:00 PM, Thu - 3 August 23

Cabinet Secretary: మోడీ ప్రభుత్వంలో కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా పదవి కాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 2024 ఎన్నికల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రధానమంత్రి మరియు మంత్రుల మధ్య సమన్వయాన్ని నెలకొల్పడానికి కేబినెట్ కార్యదర్శి పనిచేస్తారు. మోదీ ప్రభుత్వం 2019లో రాజీవ్ గౌబాను భారత క్యాబినెట్ కార్యదర్శిగా నియమించింది. అతని పదవి పొడిగింపు ఇది రెండో సారి. దీనికి ముందు గౌబా భారత హోం శాఖ కార్యదర్శిగా కూడా ఉన్నారు. అతని నాయకత్వంలో జమ్మూ మరియు కాశ్మీర్ నుండి ఆర్టికల్-370 రద్దయింది.
Also Read: KCR & Etela: బీజేపీ బిగ్ స్కెచ్, కేసీఆర్ పై ఈటల పోటీ?