Kishan Reddy: బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణలో బుల్డోజర్ చట్టం
ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి హెచ్చరించారు.
- By Balu J Published Date - 03:10 PM, Mon - 30 October 23

Kishan Reddy: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరప్రదేశ్ తరహాలో ‘బుల్డోజర్’ చట్టాన్ని అమలు చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు కల్పిస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని ఆయన ప్రకటించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి కిషన్ రెడ్డి మాట్లాడారు.
“సంఘ వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలకు పాల్పడే” AIMIM పార్టీ కార్యకర్తలు మరియు నాయకులపై బిజెపి బుల్డోజర్ విధానాన్ని ఉపయోగిస్తుందని అన్నారు. మజ్లిస్ నేరగాళ్లతో ఉక్కు హస్తాలతో వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ముస్లింలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కిషన్‌రెడ్డి, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేమని, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.