KTR : ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మండిపడ్డ కేటీఆర్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రమే పోటీ జరిగిందని విశ్లేషకులు
- By Prasad Published Date - 06:30 PM, Thu - 30 November 23

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య మాత్రమే పోటీ జరిగిందని విశ్లేషకులు తెలిపారు. ఇటు ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్‌కే అనుకూలంగా వచ్చాయి. అన్ని సర్వేలు కాంగ్రెస్‌దే అధికారమంటూ సర్వేలో తెలిపాయి. క్లియర్ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓ పక్క ఎన్నికలు జరుగుతుంటే ఎగ్జిట్ పోల్స్ ఎంటంటూ మండిపడ్డారు. ఈ తరహా ఎగ్జిట్ పోల్స్ అన్ని గతంలో చూశామని.. తమకు ఇవి కొత్తవి కావంటూ కామెంట్స్ చేశారు. ఎగ్జిట్ పోల్స్ తప్పయితే తమకు క్షమాపణలు చెప్తారా అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.ఎగ్జిట్ పోల్స్ ఓ రబ్బిష్ అంటూ వ్యాఖ్యానించారు. మళ్లీ అధికారం తమదేనని.. హ్యట్రిక్ కొడుతున్నామంటూ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.