BRS Parliamentary Meeting: 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం!
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఖమ్మం సభ తర్వాత దూకుడు పెంచారు.
- By Balu J Published Date - 01:05 PM, Fri - 27 January 23

తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఖమ్మం సభ తర్వాత దూకుడు పెంచారు. వరుసగా సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 29 తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రగతి భవన్ లో సిఎం కేసిఆర్ అధ్యక్షతన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం భోజనం అనంతరం సమావేశం ప్రారంభమవుతుంది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్లమెంటులో చర్చించ బోయే అంశాలపై, అనుసరించ వలసిన వ్యూహం పై, అధినేత, సిఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.