Singer Passed Away: ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్ గుండెపోటుతో మృతి
ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ (39) గుండెపోటుతో మృతి (Singer Passed Away) చెందాడు.
- By Gopichand Published Date - 06:57 AM, Thu - 29 June 23

Singer Passed Away: ప్రముఖ గాయకుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్ (39) గుండెపోటుతో మృతి (Singer Passed Away) చెందాడు. బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి బిజినపల్లి మండలం కారుకొండలో తన ఫామ్ హౌస్‌కి వచ్చిన ఆయన.. రాత్రి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు నాగర్‌కర్నూలులోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి చంద్ మృతి చెందారు.
సాయి చంద్ బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు. అర్ధరాత్రి అస్వస్థకు గురైన సాయి చంద్‌ని నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయి చంద్ కన్నుమూశారు. సాయి చంద్ మరణంపై బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: Minister Amit shah: బండి సంజయ్‌కు అమిత్ షా ఫోన్.. ఆ విషయంపై స్పష్టమైన హామీ ఇచ్చిన షా..
సాయి చంద్ విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన సాయి చంద్ తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యపరిచారు. ఇప్పటివరకు అనేక పాటలు పాడారు. అందులో ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సాయిచంద్‌ను 2021 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించారు.