BRS Ex mp: 2 లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో సరిపెట్టారు
- By Balu J Published Date - 12:45 AM, Wed - 7 February 24
BRS Ex mp: అధికారంలోకి రాగానే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోదండరాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 గ్రూప్ -1 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిందని …ఈనెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో (ఒక లక్ష 99940 )ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీల వివరాలు స్పష్టం చేయడంతో పాటు వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలుంటుందని, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు.
సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం గార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారని, మిగతా (ఒక లక్ష 99940) ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో నిరుద్యోగులకు స్పష్టతనివ్వాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో 1,60083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, 42 వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిందని కోర్టు కేసుల కారణంగా నియామకాలు జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2024 డిసెంబర్ 31 నాటికి ఇస్తామన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
Related News
PM Modi: కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి బీజేపీ-ఎన్డీయేకు మాత్రమే ఉంది : ప్రధాని మోదీ
PM Modi: తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలకు దూరదృష్టి లోపించిందని, బీజేపీ-ఎన్డీయే మినహా మరే రాజకీయ శక్తి ఈసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ 15 సీట్లకు మించి గెలవదు. కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా హాఫ్ సెంచరీ మార్కును కూడా దాటలేకపోతోంది. పశ్చిమబెంగాల్ లో కూడా వామపక్షాల పరిస్థితి ఏంటో �