HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >British Tourist Dies After Trying Drink All 21 Cocktails Menu

British Tourist: బార్ లో ఉన్న అన్ని కాక్ టెయిల్స్ తాగిన వ్యక్తి.. చివరికి అలా?

తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక బ్రిటిష్ అతను కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళగా అదికాస్త విషాదయాత్రగా మారింది. అసలేం జరిగిందంటే.. బ్రి

  • By Anshu Published Date - 05:20 PM, Wed - 28 June 23
  • daily-hunt
British Tourist
British Tourist

తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక బ్రిటిష్ అతను కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్ళగా అదికాస్త విషాదయాత్రగా మారింది. అసలేం జరిగిందంటే.. బ్రిటన్ కు చెందిన తిమోతి సదరన్ అనే 53 ఏళ్ళ వ్యక్తి తన సహోదరి, పిల్లలు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేయడం కోసం జమైకా వెళ్ళాడు. తీరా విహారయాత్రకు వెళ్లిన తర్వాత మద్యం సేవించకపోతే యాత్ర అసంపూర్తిగా ఉంటుందని భావించి వారు బస చేసిన హోటల్ దగ్గర్లో బార్లు ఏమైనా ఉన్నాయేమోనని ఆరా తీశాడు.

అయితే అక్కడికి దగ్గర్లోనే డికామెరూన్ క్లబ్ కరీబియన్ బార్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు తిమోతి. బార్ మెనులో మొత్తం 21 కాక్ టెయిల్ డ్రింకులు ఉండటంతో అత్యుత్సాహంతో అన్నింటినీ ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు. కానీ 12 రకాల కాక్ టెయిళ్ళు తాగేసరికి మొహం మొత్తి అక్కడితో సురాపానం ఆపేసి హోటల్ రూముకు వెళ్లిపోయాడు. అయితే 12 రకాల కాక్ టెయిళ్ళు తాగడంతో కడుపు నొప్పితో హోటల్ రూములో చాలాసేపు ఇబ్బంది పడినట్లు అతని కుటుంబసభ్యులు తెలిపారు. అంబులెన్స్ కోసం ఎంత గట్టిగా అరిచినా కూడా ఎవ్వరూ పట్టించుకోలేదని వారు తెలిపారు.

ఇక నొప్పితో విలవిల్లాడిపోయిన తిమోతి చాలాసేపు అరిచి వాంతులు చేసుకున్నాక చలనం లేకుండా పడిపోయాడని, తర్వాత ఎంత పిలిచినా స్పందించలేదని ఆమె తెలిపారు. అయితే అక్కడే ఉన్న ఒక నర్సు అంబులెన్సుకు కబురు చేసిందనుకున్నాను. కానీ ఆమె కబురు చేయలేదు. ఈలోపే తిమోతి పల్స్ పడిపోయి చనిపోయాడు అని ఆమె తెలిపింది. అతని మృతి పట్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అప్పటికే తెల్లవార్లు బ్రాందీ, బీర్లు తాగి ఉన్న తిమోతికి బార్ లో ఇద్దరు కెనడాకు చెందిన యువతులు పరిచయమయ్యారని వారిలో ఒకరి పుట్టినరోజు సందర్బంగా సవాలుగా తీసుకుని 21 కాక్ టెయిల్ డ్రింకులు తాగే ప్రయత్నం చేశాడని ఆ కారణం చేతనే అక్యూట్ గ్యాస్ట్రో ఎంటరైటిస్ తో చనిపోయినట్లు వారు నిర్ధారించారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • British Tourist
  • cocktails
  • drink 21 cocktails
  • tourist dies

Related News

    Latest News

    • CM Revanth Aerial Survey : వరద ప్రాంతాల్లో రేపు సీఎం రేవంత్ పర్యటన

    • Software Employees Problems : సాఫ్ట్ వేర్ ఉద్యోగులను వెంటాడుతున్న ఆ సమస్యలు!

    • Delhi Pollution : ఢిల్లీ ప్రజలను భయపడుతున్న వాయు కాలుష్యం

    • Harish Rao Father Died : హరీశ్ రావును పరామర్శించిన కవిత

    • Gold Bond : గోల్డ్ బ్యాండ్ ధ‌ర‌కు రెక్క‌లు..ఇప్పుడు 3వేలు..ఇప్పుడెంతో నాల్గురెట్లు.!

    Trending News

      • Traffic Challan Cancellation: మీరు ఏదైనా వాహ‌నం న‌డుపుతున్నారా? అయితే ఈ ట్రాఫిక్ రూల్ తెలుసుకోవాల్సిందే!

      • Bigg Boss : బిగ్ ట్విస్ట్ .. శ్రీజ గెలిచిందంటూ మాధురి ప్రకటన.. ఆసుపత్రికి భరణి.!

      • Andhra Pradesh vs Karnataka : కర్ణాటక కాంగ్రెస్ పోస్ట్ కు.. టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్..!

      • Madugula Halwa : ఫస్ట్ నైట్ కోసం స్పెషల్‌గా తయారు చేసే మాడుగుల హల్వా ..ఎలా చేస్తారో తెలుసా ?

      • Shreyas Iyer In ICU: శ్రేయ‌స్ అయ్య‌ర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వ‌చ్చింది?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd