Delmont: దారుణం.. చిన్నారిని దత్తత తీసుకున్న దంపతులు.. చివరికి అలా?
ప్రస్తుత రోజుల్లో చాలామంది దంపతులకు పిల్లలు కలగక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్స్ చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే మరి కొందరే మాత్రం పుట్టిన ప
- By Nakshatra Published Date - 05:50 PM, Wed - 2 August 23
ప్రస్తుత రోజుల్లో చాలామంది దంపతులకు పిల్లలు కలగక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్స్ చుట్టూ దేవాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే మరి కొందరే మాత్రం పుట్టిన పిల్లలను చెత్తకుప్పలలో, పబ్లిక్ లో వదిలేసి వెళుతున్నారు. కొందరు దంపతులు పిల్లలు లేరు అని దిగులు చెందకుండా అనాధాశ్రమంలో ఉన్న పిల్లలను దత్తత తీసుకొని మరి పెంచుకుంటున్నారు. తాజాగా ఒక జంట కూడా అలాగే ఒక అబ్బాయిని దత్తత తీసుకుంది. కానీ చివరికి ఊహించని దారుణానికి ఒడిగట్టింది. అసలేం జరిగిందంటే.. డెల్మాంట్కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టి అనే దంపతులు పెన్సిల్వేనియాకు చెందిన లాండన్ అనే 5 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు.
ఈ దంపతులు జనవరి 30వ తేదీన తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న లాండన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. తమ బాబు ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అతడ్ని ఎలాగైనా కాపాడాలని ఆ జంట కోరింది. వెంటనే లాండన్ వెంటనే ట్రీట్మెంట్ చేయడం మొదలుపెట్టిన వైద్యులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. బాలుడి తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించారు. అలాగే అతడు తీవ్ర నొప్పితో బాధపడుతుండటాన్ని గుర్తించారు. ఆ గాయాలు చూసి అతడ్ని తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారని పసిగట్టారు. అతనికి మెరుగైన చికిత్స అందించి, కాపాడ్డానికి ప్రయత్నించారు కానీ చివరికి ఫిబ్రవరి 7వ తేదీన లాండన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అతడ్ని చిత్రహింసలకు గురి చేశారన్న విషయం తేలడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
అతని పెంపుడు తల్లి లారెన్, జాకబ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి కేసుని విచారించిన వెస్ట్‌మోర్ ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ వాళ్లిద్దరు కలిసి లాండన్‌ను రాత్రి పగలు టార్చర్ పెట్టి, అత్యంత కిరాతకంగా హత్య చేశారని వెల్లడించింది. మరో ట్విస్ట్ ఏమిటంటే లాండన్‌కు ట్రీట్మెంట్ అందుతున్న సమయంలో అతని పెంపుడు తల్లిదండ్రులు గో ఫండ్ ద్వారా నిధుల్ని సేకరించారు. వారికి 5 వేల డాలర్లకు పైగా నిధులు వచ్చినట్టు తెలిసింది. అటు డాక్టర్లు పిల్లాడి దయనీయ పరిస్థితి గురించి వివరించారు. తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలకు ఆ ఐదేళ్ల చిన్నారికి మెదడులో రక్తస్రావం జరిగిందని పోలీసులకు వివరించారు. అలాగే చిన్నారిని కొట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడానికి ఒక రోజంతా వేచి చూశారని అన్నారు. పిల్లాడి శరీరంపై గతంలో అయిన గాయాలతో పాటు కొత్త గాయాలు ఉండటాన్ని గమనించామని, శారీరక వేధింపుల వల్లే ఆ గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ఆ బాలుడు కనీసం నిలబడలేకపోయాడని తినడానికి, తాగడానికి వీలుకాని పరిస్థితిలో దుర్భర స్థితిని ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో అతని అవయవాల పనితీరు మరింతగా బలహీనపడిందని వైద్యులు తెలిపారు. కాగా.లాండన్ పట్ల అతని పెంపుడు తండ్రి జాకబ్ ఎంతో ద్వేషం ప్రదర్శించాడని, చేతికి దొరికిన వస్తువులతో కొట్టేవాడని, తమకు ఏడుపులు బయటిదాకా వినిపించేవని స్థానికులు వెల్లడించారు.
Related News
Gujarat : 200 కోట్ల సంపదను విరాళంగా ఇచ్చి..సన్యాసం స్వీకరించిన గుజరాత్ దంపతులు
Gujarat couple: గుజరాత్‌కు చెందిన ఒక సంపన్న జైన దంపతులు.. భవేష్ భండారీ మరియు అతని భార్య దాదాపు ₹200 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంతే కాకుండా వారు సన్యాసం కూడా స్వీకరించారు. హిమ్మత్‌నగర్‌కు చెందిన ఈ జంట ఫిబ్రవరిలో జరిగిన ఒక వేడుకలో తమ మొత్తం సంపదను విరాళంగా ఇచ్చారు. ఈ నెలాఖరులో జరిగే ఒక కార్యక్రమంలో త్యజించే జీవితానికి కట్టుబడి ఉన్నారు. వారి 9 ఏళ్ల కుమార్తె మరియు 16 ఏళ్ల కుమారుడు 2022లో […]