Kadiyam Srihari: 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనడంలో తప్పేముంది: కడియం శ్రీహరి
- By Balu J Published Date - 01:16 PM, Sat - 30 December 23

ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేశారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చారు. 22 ల్యాండ్ క్రూజర్ కార్లను కొనుగోలు చేసిందని స్పష్టం చేశారు కడియం శ్రీహరి. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ఇందులో అవినీతి ఏమైనా జరిగిందా అని కాంగ్రెస్ మంత్రులను నిలదీశారు. ప్రగతి భవన్‌ను ఆస్పత్రి చేస్తామని చెప్పారు.. ఇప్పుడు ఎవరు ఉన్నారని మంత్రులను ప్రశ్నించారు.
రూ.93వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో వివరించాలని కాంగ్రెస్ సర్కార్‌ను కోరారు కడియం. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని చెప్పారు. అంచనాలు పెంచడానికి కారణాలను కూడా ఆయన తెలిపారు. కాంగ్రెస్ మంత్రలు కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లి అక్కడ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. జనాన్ని మభ్యపెట్టేందుకు కొత్త డ్రామాలకు తెర లేపారని కాంగ్రెస్ సర్కార్‌పై కడియం శ్రీహరి విమర్శలు చేశారు. కడియం వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏవిధంగా రియాక్ట్ అవుతుందో మరి.
Also Read: Traffic Challans: ట్రాఫిక్ చలాన్ ఆఫర్ కు భారీ స్పందన, 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లు క్లియర్!