PM Modi-Shah Rukh : ప్రధాని మోడీ, షారుఖ్ ఖాన్ డూప్లికేట్ల సమావేశం.. ఫేక్ వీడియో వైరల్
PM Modi-Shah Rukh : డీప్ ఫేక్ వీడియోలపై భారత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.
- By Pasha Published Date - 01:22 PM, Sat - 23 December 23

PM Modi-Shah Rukh : డీప్ ఫేక్ వీడియోలపై భారత ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. అలాంటి వీడియోలను పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర సర్కారు స్పష్టం చేస్తోంది. ఈక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్‌లు కలిసి మాట్లాడుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు షారుఖ్ ఖాన్, ప్రధాని మోడీ తరహా వస్త్రధారణలో ఉన్నారు. అయితే వీడియోను ఎడిట్ చేసి.. వారి తలలను షారుఖ్ ఖాన్, ప్రధాని మోడీ తలలతో(PM Modi-Shah Rukh) రీప్లేస్ చేశారు. ఈ ఫేక్ వీడియోను లయీబా ఫిర్దౌస్ (Laibah Firdaus) అనే ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది. లయీబా ఫిర్దౌస్ డిసెంబరు 21న ఈ వీడియోను పోస్ట్ చేయగా.. ఇప్పటివరకు 86వేల వ్యూస్ వచ్చాయి. ఇదే వీడియోను డిసెంబరు 22న Megh Updates అనే ట్విట్టర్ పేజీలో అప్ లోడ్ చేయగా ఇప్పటిదాకా 5.50 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోలపై నెటిజన్స్ నుంచి కామెంట్స్, లైక్స్ వెల్లువెత్తాయి.
Caption Needed 😭 pic.twitter.com/CWMNDGuqSE
— Laibah Firdaus. لائبہ فردوس (@FirdausLaibah) December 21, 2023
ఫేక్ వీడియోలను గుర్తుపట్టండిలా..
- ముఖ్యంగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఈవిధంగా డీప్ ఫేక్ వీడియోలను కొందరు క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు. అయితే కొన్ని అంశాల ఆధారంగా ఇలాంటి ఫేక్ వీడియోలను మనం గుర్తించవచ్చు.
- డీప్ ఫేక్ వీడియోల్లో ఉండే మనుషుల కదలికలు అసహజంగా ఉంటాయి.
- సహజంగా కనురెప్పులు ఆడకపోవడం, ముఖ కవళికల్లో మార్పులు లేకపోవడాన్ని బట్టి అది ఫేక్ వీడియో అని అర్థం చేసుకోవచ్చు.
- సందర్భానికి అనుగుణంగా ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్ లేకపోయినా అది ఫేక్ వీడియోగా భావించాలి.
- వీడియోలో మొహాలు ఎబ్బెట్టుగా కనిపించినా అది ఫేక్ వీడియోనే.
- ముక్కు, నోరు, కళ్లు అసహజంగా కనిపించినా.. శరీర కదలికలు, మొహం కదలికల్లో తేడాగా కనిపించినా దాన్ని అనుమానించాలి.
- డీఫ్ ఫేక్ వీడియోల పిక్సెల్స్ విడిపోయినట్లు మసక, మసకగా కనిపిస్తుంటాయి.
- వీడియోను ఎవరు పోస్ట్ చేశారన్న విషయాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలి. వీడియో పోస్ట్ చేసిన వారి విశ్వసనీయతను బట్టి వీడియో రియలా ? ఫేకా ? అనేది కన్ఫర్మ్ అవుతుంది.