BJP: కేసీఆర్ తీరుకు నిరసనగా ‘బీజేపీ భీం దీక్ష’
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బిజెపి
- Author : Balu J
Date : 03-02-2022 - 12:58 IST
Published By : Hashtagu Telugu Desk
భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ” బీజేపీ భీం దీక్ష ” ప్రారంభించింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ విషయంలో కేసీఆర్ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు వదిలిపెట్టేది లేదు. ఈ దీక్షలో నాతో పాటు ఎస్సీ మోర్చా రాష్ట్ర ఇన్ చార్జి మునిస్వామి, ఎంపీలు Arvind Dharmapuri, సోయం బాపూరావు గారు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శ్రుతి గారు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి బాలసుబ్రమణ్యం గారు, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు శ్రీరామ్ సహా పాల్గొన్నారు.