Maharajganj: మాట మార్చిన అత్యాచార బాధితురాలు
ఉత్తరప్రదేశ్ మహరాజ్‌గంజ్‌జిల్లా బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మాసూమ్ రజా రాహీపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్‌లో దళిత టీనేజర్
- Author : Praveen Aluthuru
Date : 07-09-2023 - 4:50 IST
Published By : Hashtagu Telugu Desk
Maharajganj: ఉత్తరప్రదేశ్ మహరాజ్‌గంజ్‌జిల్లా బీజేపీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు మాసూమ్ రజా రాహీపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని మహరాజ్‌గంజ్‌లో దళిత టీనేజర్ పై అత్యాచారం చేసి, బాధితురాలి తండ్రిని హత్య చేసిన కేసు కీలక మలుపు తిరిగింది. ఆగస్టు 28 రాత్రి 8 గంటలకు బీజేపీ నేత మసూమ్ రజా రాహి గదిలోకి ప్రవేశించి తనపై అత్యాచారం చేశాడని బాలిక ఆరోపించింది. ఇది జరిగిన కొద్దీ సమయంలోపే బాలిక మాట మార్చింది. ఈ కేసులో బాధితురాలు కేసును ఉపసంహరించుకుంది. పోలీసులు, మేజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని మార్చుకుంది. ఇదిలా ఉండగా మహరాజ్‌గంజ్‌లో దళిత బాలికపై జరిగిన అఘాయిత్యాన్ని ఆప్ తీవ్రంగా ఖండించింది. నిందితుడిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది. ఆప్ యూపీ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ మాట్లాడుతు.. పోలీసులు అతడిని కాపాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయంలో పోలీసులు సత్వరమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే నిరసన తెలియజేస్తామని అన్నారు. తీరా చూస్తే బాధితురాలు తన వాంగ్మూలాన్ని మర్చి చెప్పింది. దీంతో కేసు మొదటికి వచ్చింది.
Also Read: Jagan Office Shifting : ఛలో వైజాగ్…ముహూర్తం ఫిక్స్