HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bjp Can Form Government In Bihar Without Jdu See New Nda Equations Without Nitish

Bihar: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. ఎన్డీఏ ప్రభంజనం, బీజేపీకి తిరుగులేని ఆధిక్యం!

బీహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి ఓటమికి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ యాదవ్, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కృష్ణ అలవారుఉను బాధ్యులుగా పేర్కొన్నారు.

  • Author : Gopichand Date : 14-11-2025 - 5:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bihar
Bihar

Bihar: బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌లలో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) 94 స్థానాల్లో ముందంజలో ఉంది. ఈ ట్రెండ్‌లు విజయాలుగా మారితే నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ (JDU) మద్దతు లేకుండానే బీజేపీ బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

నితీష్ లేకున్నా సంఖ్యా బలం

కొత్త సమీకరణాల ప్రకారం.. బీజేపీ, దాని మిత్రపక్షాల సీట్లు కలిపి బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సంఖ్య 122ను చేరుకున్నాయి.

  • బీజేపీ (BJP): 94 స్థానాలు
  • లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) – చిరాగ్ పాశ్వాన్: 19 స్థానాలు
  • హిందుస్తానీ ఆవామ్ మోర్చా (HUM) – జీతన్ రామ్ మాంఝీ: 5 స్థానాలు
  • రాష్ట్రీయ లోక్ మోర్చా (RLM) – ఉపేంద్ర కుష్వాహ: 4 స్థానాలు
  • మొత్తం: 122 స్థానాలు

Also Read: Mahesh Babu: అభిమానుల కోసం మ‌హేష్ బాబు ప్ర‌త్యేక వీడియో.. ఏమ‌న్నారంటే?!

ఈ లెక్కలలో జేడీయూ ముందంజలో ఉన్న 82 స్థానాలను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ రెండూ చెరో 101 స్థానాల్లో పోటీ చేయగా 94 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించడం విశేషం.

ముఖ్యమంత్రి అభ్యర్థిపై సందేహం

బీహార్ ఎన్నికల కోసం మహాకూటమి తేజస్వీ యాదవ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ.. బీజేపీ మాత్రం చివరి నిమిషం వరకు నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి నిరాకరించింది. వేదికలపై నితీష్‌ను కేవలం మౌఖికంగా మాత్రమే అభినందిస్తూ, ఎన్డీఏకు మెజారిటీ వస్తే ఎమ్మెల్యేల సమావేశంలోనే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని బీజేపీ అగ్ర నాయకులు పదేపదే చెప్పారు. బీజేపీ అగ్ర నేతలు సైతం నితీష్ కుమార్ పేరును కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించడానికి దూరంగా ఉండటం గమనార్హం.

2020 కంటే మెరుగైన ప్రదర్శన

2020 ఎన్నికల్లో ఎన్డీఏలో భాగంగా బీజేపీ 110 సీట్లలో పోటీ చేసి 74 సీట్లు గెలుచుకుంది. జేడీయూ 115 సీట్లలో పోటీ చేసి కేవలం 43 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో బీజేపీకి 9 సీట్లు, జేడీయూకు 14 సీట్లు తగ్గినప్పటికీ 101 సీట్లలో పోటీ చేసిన బీజేపీ ఇప్పుడు 94 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇది బీహార్‌లో ఈసారి బీజేపీ ప్రభంజనం నడిచిందనడానికి స్పష్టమైన సంకేతం. జనసురాజ్, ఇతర చిన్న పార్టీలు మహాకూటమి ఓట్లను చీల్చడం కూడా ఎన్డీఏకు నేరుగా లాభించింది.

కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ స్పందన

బీహార్ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి ఓటమికి కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ అఖిలేష్ సింగ్, ఆర్జేడీకి చెందిన సంజయ్ యాదవ్, కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ కృష్ణ అలవారుఉను బాధ్యులుగా పేర్కొన్నారు. సీట్ల పంపకంలో జరిగిన ఆలస్యం, ఫ్రెండ్లీ ఫైట్‌కు అవకాశం లేకపోవడం వంటి కారణాలను వారు వివరించాలన్నారు. ఓటమికి గల కారణాలను తెలుసుకోవడానికి తాము సమావేశంలో కూర్చుంటామని తెలిపారు. ఆయన నితీష్, ఎన్డీఏ కూటమికి అభినందనలు తెలిపి ప్రచారంలో కనిపించిన జన సందోహం, వచ్చిన ఫలితాలకు పూర్తి విరుద్ధంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bihar
  • Bihar Election 2025
  • Bihar Elections
  • jdu
  • nda
  • nitish kumar

Related News

Nitish Kumar

బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై ఎఫ్ఐఆర్.. కార‌ణ‌మిదే?!

ఆమె తన పోస్ట్‌లో ఇలా పేర్కొన్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై కోఠి బాగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. ఒక ముస్లిం మహిళా ముసుగును బలవంతంగా తొలగించడం ద్వారా ఆమె గౌరవానికి భంగం కలిగించారు.

    Latest News

    • మీ పిల్లలకు రాయడం నేర్పించే పద్ధతులు ఇవే!

    • లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!

    • విజయ్ హజారే ట్రోఫీ.. రోహిత్, విరాట్ సెంచరీలు.. ప్రత్యక్ష ప్రసారం ఎందుకు లేదు?

    • బంగ్లాదేశ్ ఎన్నికలు.. షేక్ హసీనా పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ!

    • డిప్యూటీ సీఎం పవన్ ఎఫెక్ట్.. భీమవరం డీఎస్పీపై బదిలీ వేటు !

    Trending News

      • మీ స్నేహితులు, బంధుమిత్రులకు క్రిస్మస్ ఇలా తెలియజేయండి!

      • క్రిస్మస్ కేక్ కథ.. గంజి నుండి ఫ్రూట్ కేక్ వరకు ఎలా మారింది?

      • టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కార‌ణ‌మిదేనా?

      • నిధి అగర్వాల్, సమంత పడ్డ వేదన నా మైండ్‌లో నుండి పోలేదు.. అందుకే అలా మాట్లాడాను Sivaji

      • శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd