MLC Kavitha: ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు
- By Balu J Published Date - 11:35 PM, Wed - 13 March 24
MLC Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం నాడు ఘనంగా జరిగాయి. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు ఆమె ఇంటికి చేరుకొని భారీ కేక్ ను కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, తన జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిసి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
మరోవైపు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తనకు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటి వరకు తొమ్మిది పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అయితే నిజామాబాద్ బరిలో కవిత దిగుతారని అందరూ భావించారుు. కానీ కేసీఆర్ బాజిరెడ్డి గోవర్ధన్ పేరు ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు షాక్ అయ్యారు.
Related News
Hyderabad: హైదరాబాద్ లో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి, డబ్బులు స్వాధీనం
Hyderabad: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో పాటు గంజాయి అక్రమ రవాణా ను నియంత్రించేందుకు మల్టీ జోన్ 1 పరిధిలో 16 జిల్లాల్లో పోలీసులు, ప్రధాన రోడ్డు మార్గాల్లో వాహన తనిఖీలతో పాటు రైళ్ళల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. అక్రమ గంజాయి కట్టడి చేయాలనే లక్ష్యంగా మల్టీ జోన్ 1 ఐ. జీ ఎ. వి. రంగనాథ్ ఆదేశాల మేరకు మల్టీ జోన్ 1 పరిధిలోని 16జిల్లాల్లో పోలీస్ అధికారులు, ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టా