Traffic: భీమ్లా నాయక్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు!
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
- By Balu J Published Date - 09:34 PM, Tue - 22 February 22

భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11గం వరకూ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఈవెంట్ జరగనుంది. మైత్రీవనం నుంచి యూసఫ్ గూడ వైపు వాహనాలకు అనుమతి ఉండదు. ప్రిరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే అభిమానులకు, కేవలం 23వ తేదీ వరకు ఉన్న పాసులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
– సవేరా ఫంక్షన్ హాల్-క్రిష్ణ కాంత్ పార్క్-కళ్యాణ్ నగర్-సత్యసాయి నిగమగమం-కృష్టానగర్ మీదుగా వాహనాలు మళ్లింపు
– జూబ్లిహల్స్ చెక్ పోస్ట్ నుంచి యూసఫ్ గూడా వైపు వచ్చే వాహనాలు శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమగమం వైపు మళ్ళింపు
-సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్, యూసఫ్ గూడా మెట్రో స్టేషన్ , కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడయం, ప్రభుత్వ పాఠశాలలో పార్కింక్ ప్రదేశాలు