HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Best Drinking Habit To Reverse Aging

Eternal Youth: నిత్యయవ్వనంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

సాధారణంగా మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు పాటు జీవించగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ

  • Author : Anshu Date : 16-07-2022 - 7:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Drinking Water
Drinking Water

సాధారణంగా మనిషి ఆహారం లేకుండా కొన్ని రోజులు పాటు జీవించగలడేమో కానీ నీరు లేకుండా మాత్రం ఎక్కువ రోజులు జీవించలేడు. నీళ్లు లేకుండా ఎక్కువ రోజులు పాటు ప్రాణాలతో ఉండటం అన్నది అసాధ్యం చెప్పవచ్చు. శరీరంలో జీవక్రియలు సరిగా పనిచేయాలి అంటే నీరు తప్పనిసరి. అంతేకాకుండా ఒక వ్యక్తి రోజు వారీగా తీసుకొని నీటి పరిమాణం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే శరీరానికి సరిపడా నీరు తాగే వారి చర్మం ఎప్పుడూ కూడా కాంతివంతంగా ఉంటుంది.అయితే రోజులో కనీసం 2 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగితేనే ఫలితాలు కనిపిస్తాయి.

శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవడం వల్ల చర్మం ఎలాస్టిసిటీ అలాగే కొనసాగుతుంది. దీంతో వృద్ధాప్యపు ఛాయలు పెద్దగా కనిపించవు అని అంటున్నారు నిపుణులు. అలాగే నీటిని తీసుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో సరిపడా తాగకపోవడం వల్ల అనర్థాలు కూడా ఉన్నాయి. నీరు తక్కువగా తాగడం వల్ల బరువు పెరుగుతారు. కోపం వస్తుంటుంది. శక్తి చాలనట్టుగా ఉంటారు. చర్మం త్వరగా ముడతలు పడిపోతుంది. మానవ శరీరంలో 60 శాతం నీరే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మన శరీరంలో ఎన్నో క్రియలకు నీరు కావాలి.

శరీర ఉష్ణోగ్రత నిర్వహణ, శక్తి, జాయింట్లలో మృదుత్వం, హార్మోన్ల సాఫీ పనితీరు, పోషకాలు శరీరం అంతటికి అందడానికి నీరు కావాల్సిందే. మరి శరీరంలో అన్ని జీవక్రియలు సరిగా పని చేయాలి అంటే నీరు కూడా తగినంత తాగాలి. పుష్కలంగా తాగే వారికి వృద్ధాప్యపు ఛాయలు కొంత ఆలస్యంగానే కనిపిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అధ్యయనాలు తెలుపుతున్నాయి. అయితే కేవలం నీరు తీసుకుంటే వృద్ధాప్యం ఆలస్యం అవుతుందా? అని అంటే కాదు అని సమాధానం వినిపిస్తుంది. మనం తరచు తీసుకునే ఆహారం, జీవన శైలి, ఇతర ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా వృద్ధాప్యాన్ని నిర్ణయిస్తాయి. కాకపోతే అవన్నీ సరిగ్గా ఉండి, నీరు తగినంత లేకపోతే నష్టం జరుగుతుంది. కనుక వృద్ధాప్యపు ఛాయలు త్వరగా కనిపించడకుండా, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండడంలో నీరు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Aging
  • Drinking
  • health
  • Reverse Aging
  • water
  • younger

Related News

Health

Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

హైబీపీ (అధిక రక్తపోటు) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒక ప్రధాన ఆరోగ్య సమస్య. దీనిని “సైలెంట్ కిల్లర్” అని పిలుస్తారు. కారణం, చాలా మందిలో హైబీపీ ఉన్నప్పటికీ ప్రారంభ దశల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. వ్యక్తికి తాను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాననే భావన ఉన్నప్పటికీ, లోపల గుండె, మెదడు, మూత్రపిండాలు మరియు కంటి రక్తనాళాలపై నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉం

    Latest News

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • TPCC : హైదరాబాద్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసిన జగన్నారెడ్డి

    • New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్‌బీఐ కసరత్తు వేగవంతం

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd