Suchandra Dasgupta: రోడ్డు ప్రమాదంలో నటి మృతి
బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నటి సుచంద్ర దాస్‌గుప్తా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుచంద్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది
- Author : Praveen Aluthuru
Date : 22-05-2023 - 7:26 IST
Published By : Hashtagu Telugu Desk
Suchandra Dasgupta: బెంగాలీ చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రఖ్యాత నటి సుచంద్ర దాస్‌గుప్తా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సుచంద్ర షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆమె పశ్చిమ బెంగాల్‌లోని పానిహతి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె తిరిగి ఇంటికి వెళ్లడానికి బైక్ ని బుక్ చేసుకున్నారు. ఇంటికి వెళుతుండగా ఘోష్ పారా సమీపంలో ఆమెకు ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నటి ప్రాణాలు కోల్పోయింది.
ప్రకారం ప్రకారం… షూటింగ్ అనంతరం ఇంటికివెళ్లేందుకు సుచంద్ర మొబైల్ ఆప్ ద్వారా బైక్ రైడ్ బుక్ చేసుకుంది. అయితే అకస్మాత్తుగా సైకిల్ నడుపుతున్న వ్యక్తి ఎదురుగా రావడంతో బైక్ నడుపుతున్న వ్యక్తి బ్రేకులు వేసి వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించాడు. దీంతో బైక్ అదుపుతప్పింది. ఆపై ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత సుచంద్ర కిందపడిపోవడంతో లారీ ఆమెపై నుంచి దూసుకెళ్లింది. సుచంద్ర హెల్మెట్ కూడా ధరించారు. లారీ తలమీదకు ఎక్కడంతో ఆ హెల్మెట్ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచంద్ర బెంగాలీ టీవీ పరిశ్రమలో సుపరిచితమైన పేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు. సుచంద్ర ‘విశ్వరూప్ బంద్యోపాధ్యాయ’, ‘గౌరీ ఐలో’ చిత్రాల్లో నటించారు. 29 ఏళ్ల నటి మరణంతో ఆమె సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Read More: RCB vs GT: శుభమన్ గిల్ దెబ్బకి బెంగళూరు ఔట్.. ప్లేఆఫ్స్‌కి ముంబయి