Alert: జర జాగ్రత్త.. ఐదు రోజుల్లో ఎండలే ఎండలు
- Author : Balu J
Date : 28-03-2024 - 10:42 IST
Published By : Hashtagu Telugu Desk
Alert: రాబోయే ఐదురోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. 27 నుంచి 30 వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ, నారాయణపేట, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది.రాగల ఐదురోజుల పాటు రానున్న ఐదు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం వాతావరణ శాఖ అంచనా వేసింది.
హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఇప్పటికే పలు జిల్లాల్లో 42 డిగ్రీలను దాటాయి. రాత్రి పూట 26 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా సత్నాల, తలమడుగులో అత్యధికంగా 42.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది టీఎస్‌డీపీఎస్ తెలిపింది.