Police Over Action : సీఐ ఓవర్ యాక్షన్‌తో విద్యార్థి ఆత్యహత్యాయత్నం.. సూసైడ్ నోట్‌లో..?
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సీఐ సతీస్ ఓవర్ యాక్షన్ తో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు
- Author : Prasad
Date : 26-07-2022 - 3:16 IST
Published By : Hashtagu Telugu Desk
కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ సీఐ సతీస్ ఓవర్ యాక్షన్ తో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. బాపులపాడు మండలం కోడూరుపాడులో కోడిపందాలుపై సీఐ సతీష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పందాలు ఆడుతున్న ఐదుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అదే సమయంలో అటువైపు కుక్కను తీసుకొచ్చిన వచ్చిన బీబీఏ విద్యార్థి వసంత్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామనడిబొడ్డులో వసంత్‌ని మోకాళ్లపై కూర్చోబెట్టి పుంజుకు పెట్టి సీఐ సతీష్ ఫోటోలు తీయించారు. పోలీసు స్టేషన్ కు తరలించకుండా గ్రామంలో అవమానపర్చడంపై గ్రామస్తులు మండిపడ్డారు.
అయితే జరిగిన ఘటనపై మనస్థాపం చెందిన వసంత్ ఆత్మహత్యాయత్నంకి పాల్పడ్డాడు విజయవాడ SRR కాలేజీ లో BBA చదువుతున్న వసంత కుమార్.. తాను కోడి పందాలకి వెళ్ళలేదు, చదువు కుంటున్నా అని బ్రతిమిలాడినప్పటికి సీఐ సతీష్ వినలేదు. ఇదే విషయాన్ని రోజంతా తల్లిదండ్రులు స్నేహితులుతో చెప్పి వసంత్ వాపోయాడు. అయితే అదే రోజు రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నం చేసుకోగా గమనించిన కుటుంబసభ్యులు తలుపులు పగలగొట్టి కాపాడారు. ఆ తరువాత మళ్లీ సూసైడ్ నోట్ వ్రాసిపురుగులు మందు తాగాడు. ప్రస్తుతం పిన్నమనేని ఆసుపత్రిలో వసంత్ చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. సూసైడ్ నోట్ లో హనుమాన్ జుంక్షన్ సీఐ, వీరవల్లి ఎస్సై లతో పాటుగా మిగిలిన పోలీసులను శిక్షించాలని కోరాడు . తన కొడుకు చనిపోతే కారణం పోలీసులే అవుతారని వసంత్ తల్లి లక్ష్మి ఆరోపించారు.