HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Bairi Naresh Was Arrested

Bairi Naresh: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్ అరెస్ట్

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు.

  • Author : Gopi Date : 31-12-2022 - 12:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bairi Naresh
Resizeimagesize (1280 X 720) (1)

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భైరి నరేష్‌ (Bairi Naresh)ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో కొడంగల్ పోలీస్ స్టేషన్‌కు తరలించనున్నారు. ఓ సభలో అయ్యప్ప స్వామి సహా శ్రీరాముడిపై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో అతడిపై పలు కేసులు నమోదు అయ్యాయి.

భైరి నరేష్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. అయ్యప్ప స్వాములు ఆందోళన విరమించాలని కోరారు. అతన్ని వరంగల్‌లో అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నరేష్ రెండు రోజుల నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే.

అయ్యప్ప స్వామి గురించి భైరి నరేష్‌ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. హిందూ దేవుళ్లపై మరీ ముఖ్యంగా అయ్యప్ప స్వామి పుట్టుకపై నరేష్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై అయ్యప్ప స్వాములు తీవ్రంగా మండిపడుతున్నారు. నరేష్‌ను వెంటనే అరెస్ట్ చేయాలంటూ అయ్యప్ప స్వాములు ఆందోళనలు చేశారు. నరేష్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే నరేష్‌పై కొడంగల్‌ నియోజకవర్గంలోని పోలీస్‌ స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అ‍య్యింది.

Also Read: RTC Bus accident: రాజేంద్రనగర్‌లో ఆర్టీసీ బస్సు బీభత్సం.. చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన బస్సు

నరేష్ చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో తెలంగాణ వ్యాప్తంగా వైరల్‌ కావడంతో అయ్యప్పస్వామి భక్తులు, హిందూ సంఘాల నేతలు నరేష్‌పై మండిపడుతున్నారు. మేం నాస్తికులం.. దేవుడిని నమ్మం.. అంబేడ్కర్‌ సభ అంటేనే నాస్తికుల సభ అని బహిరంగంగానే దేవుళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు నరేష్‌. అయ్యప్ప స్వామి జననాన్ని కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో కాస్త వైరల్‌ కావడంతో భైరి నరేష్‌పై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bairi Naresh
  • Bairi Naresh Arrested
  • hyderabad
  • Kodangal
  • telangana

Related News

Zepto

Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చే

  • MIssing Case

    Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

    Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Engineering counselling in Telangana begins today.

    TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

  • Alert for gas consumers: June 30 is the final deadline. These requirements must be met—otherwise, the connection will be disconnected.

    LPG Gas Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 30 వరకే డెడ్ లైన్.. ఇవి తప్పక పాటించాల్సిందే.. లేదంటే కనెక్షన్ కట్

Latest News

  • Bandi Bhagirath: బండి భగీరథ్‌కు కండీషనల్ బెయిల్…

  • Mudragada Padmanabham Reddy: ముద్రగడ పద్మనాభ రెడ్డి కి తీవ్ర అస్వస్థత..!

  • Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

  • Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

  • Relationship: మీ భార్య కోపంగా ఉందా…? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి… కోపం కరిగిపోతుంది…!!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd