Suicide : సంగారెడ్డిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సంగారెడ్డి టౌన్‌లోని పోతిరెడ్డిపల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు
- By Prasad Published Date - 01:17 PM, Wed - 7 September 22

సంగారెడ్డి టౌన్‌లోని పోతిరెడ్డిపల్లిలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు మేఘా కపూర్‌గా పోలీసులు గుర్తించారు. కపూర్ స్వస్థలం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్. ఆగస్టు 1వ తేదీ నుంచి పట్టణంలోని ఆది లాడ్జిలో ఉంటున్నాడని పోలీసులు ప్రాథమిక సమాచారన్ని సేకరించారు. ఈ ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.