Sabarimala: అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
- By Balu J Published Date - 01:50 PM, Tue - 19 December 23

ఈ ఏడాది శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి భారీగా పెరిగింది. దీంతో దర్శనం కోసం గంటల కొద్ది వేచి చూడాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. ఈ కారణంగా నిన్న రాత్రి నుండి శబరిమల మార్గం మధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు నిలిపివేశారు. తాళ్లను కట్టి భక్తులను గంటల తరబడి నిల్చిబెట్టారు.
చిన్న పిల్లలు ఉన్నారని , ఎంతసేపు నిల్చోవాలంటూ నిలదీసిన అయ్యప్ప భక్తులపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేశారు. 18 కంపార్టుమెంట్ లలో అయ్యప్ప స్వాములు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 10 గంటలకు పైగా సమయం పడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. అయ్యప్ప స్వాములకు కనీసం మంచి నీళ్ళు కూడా అందించని ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది.
Also Read: OYO Hotels 2023: ఓయో బుకింగ్స్ లో హైదరాబాద్ రికార్డ్, అసలు కారణమిదే